కొనసాగుతున్న అల్ప పీడన ద్రోణి.. మరో రెండు రోజులు వానలే!

  • గత రెండు రోజులుగా చల్లబడిన వాతావరణం
  • శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం
  • బలహీనపడుతున్న ద్రోణి
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది.  తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. మరోవైపు తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో  రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Rains
Bay of Bengal
Indian Ocean
Telangana

More Telugu News